ఫిఫా ముందు టీ20 దిగదుడుపే.. ప్రైజ్ మనీలో నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా!
- ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం రికార్డు స్థాయిలో 655 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన
- ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ కేవలం 11.25 మిలియన్ డాలర్లు మాత్రమే
- ఫిఫా విజేతకు 50 మిలియన్ డాలర్లు.. టీ20 విజేత భారత్‌కు దక్కింది 2.64 మిలియన్ డాలర్లే
- ఫుట్‌బాల్ గ్లోబల్ వాణిజ్య ఆధిపత్యానికి, క్రికెట్ పరిమిత మార్కెట్‌కు ఈ వ్యత్యాసం నిదర్శనం
- ఫిఫాలో ఆడిన ప్రతి జట్టుకు దక్కే కనీస మొత్తం.. టీ20 మొత్తం ప్రైజ్‌మనీకి దాదాపు సమానం
ఉత్తర అమెరికా దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 మరికొన్ని గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న జట్లకు అందించే ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో పోల్చినప్పుడు, ఈ రెండు క్రీడల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య బలాన్ని ఈ గణాంకాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
ఈసారి 48 జట్లతో, 104 మ్యాచ్‌లతో రికార్డు స్థాయిలో జరుగుతున్న ఈ ఫుట్‌బాల్ సంబరం కోసం ఫిఫా ఏకంగా 655 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 5,470 కోట్లు) భారీ ప్రైజ్ మనీని కేటాయించింది. ఇది 2022 ఖతార్ ప్రపంచకప్‌తో పోలిస్తే 50శాతం అధికం. ఈ టోర్నీలో విశ్వ విజేతగా నిలిచే జట్టుకు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 417 కోట్లు) బహుమతిగా లభిస్తుంది.
మరోవైపు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లకు కలిపి ఐసీసీ కేటాయించిన మొత్తం ప్రైజ్ మనీ కేవలం 11.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 94 కోట్లు) మాత్రమే. ఇందులో విజేతగా నిలిచిన భారత జట్టుకు సుమారు 2.64 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 22 కోట్లు) దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 1.42 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12 కోట్లు) లభించాయి. ఈ లెక్కలు చూస్తే ఫిఫా విజేతకు దక్కే ప్రైజ్ మనీ, టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
ఈ రెండు మెగా టోర్నీల ప్రైజ్ మనీలో ఇంత భారీ తేడాకు ప్రధాన కారణం వాటి వాణిజ్య పరిధి, ప్రపంచవ్యాప్త ఆదరణే. ఫుట్‌బాల్ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వీక్షకులను ఆకర్షిస్తుంది. దీని ద్వారా ఫిఫాకు ప్రకటనలు, ప్రసార హక్కుల రూపంలో భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. క్రికెట్‌కు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ, ఫుట్‌బాల్‌తో పోలిస్తే దాని అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్ ఇంకా పరిమితంగానే ఉంది.
ఫిఫా ప్రైజ్ మనీ కేటాయింపులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. రన్నరప్‌కు 33 మిలియన్ డాలర్లు, మూడో స్థానానికి 29 మిలియన్ డాలర్లు, నాలుగో స్థానానికి 27 మిలియన్ డాలర్లు లభిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు 19 మిలియన్ డాలర్లు, రౌండ్ ఆఫ్ 16లో నిష్క్రమించిన వారికి 15 మిలియన్ డాలర్లు అందుతాయి. టోర్నీలో ఆడిన ప్రతి జట్టుకు సన్నాహక ఖర్చుల కింద 1.5 మిలియన్ డాలర్లతో పాటు గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించినా కనీసం 9 మిలియన్ డాలర్లు లభిస్తాయి. అంటే.. టోర్నీలో అడుగుపెట్టిన ప్రతి జట్టుకు కనీసం 10.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 87 కోట్లు) గ్యారెంటీగా లభిస్తాయి. ఇది టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ కంటే కొంచెమే తక్కువ కావడం విశేషం.
రేపటి మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, ఈ భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు జట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రపంచ క్రీడా వేదికపై ఫుట్‌బాల్‌కు ఉన్న తిరుగులేని వాణిజ్య ఆధిపత్యానికి ఈ ప్రైజ్ మనీ వ్యత్యాసమే నిలువుటద్దం పడుతోంది.